Header Banner

ప్రతీకార పాలనకు తెరపడింది.. ప్రజా విశ్వాసాన్ని గెలుచుకుంటాం! లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

  Tue Feb 04, 2025 10:20        Politics

ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలపై లోక్‌సభలో విశాఖపట్నం టీడీపీ ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవహరించినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం చేయదని, అలా వ్యవహరిస్తే ప్రజల తీర్పును అగౌరవ పరిచినట్టు అవుతుందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా తమ కృషి ఉంటుందని పేర్కొన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన చర్చలో శ్రీభరత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రతీకార రాజకీయాలు నడిచాయని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను భయపెట్టడమే ఆయుధంగా మార్చుకుందని విమర్శించారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించిందని దుయ్యబట్టారు.


ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!


బెదిరించి కాకినాడ పోర్టును స్వాధీనం చేసుకుందని, అయితే దానిని ఇటీవల తిరిగి ఇచ్చేశారని అన్నారు. తాను చైర్మన్‌గా ఉన్న యూనివర్శిటీపైనా దాడి చేశారని, తమ పార్టీ శ్రేణులు, అభిమానులను వేధింపులకు గురి చేశారన్నారు. దీనికి ప్రతిగా ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను బలపరిచారన్నారు. దీంతో భయపడిన నాటి ప్రభుత్వం తమ నాయకుడిని అరెస్టు చేసిందన్నారు. ఆ తీరును నిరసిస్తూ ప్రజలు మార్పునకు పట్టం కట్టారని తెలిపారు. కొంతకాలం కొందరిని మోసం చేయవచ్చేమో గానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీ భరత్ పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #vizag #Mp #lokesabha #todaynews #flashnews #latestupdate